రాత్రిపూట మిగిలిన అన్నాన్ని మిక్సీ జారులో వేసి.. అందులో మూడు స్పూన్ల శెనగపిండి, మూడు స్పూన్ల బియ్యం పిండి, తగినంత ఉప్పు, మజ్జిగ రెండు స్పూన్లు చేర్చి రుబ్బుకుని వడియాలుగా ఎండనివ్వాలి.
బజ్జీలు చేసుకునేందుకు కట్ చేసిన అరటి, బంగాళాదుంపల ముక్కలకు కారం, ఉప్పు చేర్చి అరగంట సేపు పక్కనబెట్టేయాలి. తర్వాత నూనెల్లో బజ్జీలు తయారు చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.