కూరగాయలు ఎక్కడ తరగాలి?

బుధవారం, 23 జులై 2014 (18:13 IST)
చాలా మంది గృహిణులు కూరగాయలను వివిధ రకాలుగా తరుగుతుంటారు. కొందరు కత్తిపీటతో తరిగితే, మరికొందరు చాకుతో తరుగుతుంటారు. అయితే, కూరగాయలు కూర్చొని తరిగినా.. నిలబడి తరిగినా.. కూరగాయలు తరగడానికి ఆధారంగా దేనినీ పెట్టుకోరు. 
 
కొందరు ప్లాస్టిక్ ప్లేట్ మీద, మరికొందరు చెక్క కింద తరుగుతుంటారు. అయితే, ఇక్కడ తరిగేది ప్లాస్టిక్ ప్లేటా లేదా చెక్కప్లేటా అనేది సమస్య కాదు. వాటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నామా అనేది ఇక్కడ ప్రధాన సమస్య. ఈ ప్లేట్లు ఎత్తుపల్లాలుగా ఉంటే ఈ గుంట ప్రదేశంలో బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు పెరిగే ప్రమాదం ఉంది. 
 
తరిగిన పదార్థం గుంటల్లో ఇరుక్కుని అనాగ్యోనికి కారణమవుతాయి. అందువల్ల ప్లాస్టిక్ ప్లేట్ అయితే చాలా మంచిది. అయితే, కూరగాయలు తరిగేటపుడు గాట్లు పడేలా ఉండే ప్లేట్లను మాత్రం వాడకూడదు. అలాగే, కూరగాయలు తరిగిన తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 

వెబ్దునియా పై చదవండి