* కొవ్వొత్తులని ఫ్రిజ్‌లో ఉంచి.. వెలిగిస్తే ఎక్కువ సేపు వెలుగుతాయి.
* ప్రమిదలని నీటిలో నానబెడితే నూనెని ఎక్కువగా పీల్చుకోవు.
* అగరొత్తుల బూడిదతో వెండి వస్తువులను తోమితే కొత్త వాటిలా మెరుస్తాయి.
* బాణలిలో పదార్థాలు అంటుకుపోతే నీళ్లు పోసి అందులో చారెడు ఉప్పు వేసి మరిగించాలి. కొద్దిసేపటికి నీళ్లు పోసేసి కాగితంతో రుద్దితే పాన్ శుభ్రపడుతుంది.
* కోడిగుడ్డును తడిపాత్రలో పగలకొడితే తర్వాత శుభ్రపరచడం తేలిక అవుతుంది.
* ఉడకబెట్టిన గుడ్డు నిల్వ ఉండాలంటే చల్లటి నీటిలో వేసి ఫ్రిజ్‌లో పెట్టండి.