కొత్తిమీరను తాజాగా ఎలా భద్రపరచాలో తెలుసా?

గురువారం, 27 ఏప్రియల్ 2023 (17:44 IST)
వేసవికాలంలో ఆకుకూరలు చాలా తక్కువగా దొరుకుతాయి. ముఖ్యంగా కొత్తిమీర దొరకదు. అందువల్ల కొత్తమీరను రిఫ్రిజిరేట‌ర్లలో ఎలా భద్రపరచాలో తెలుసుకుందా. కొత్తిమీర కాడల నుంచి ఆకులను వేరుచేయాలి. వాటిని ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచాలి. ఇలా చేస్తే 15 రోజుల వరకూ కొత్తిమీర పాడుకాదు.
 
కొత్తిమీర ఆకులను వేరుచేసి వాటిని మెత్తగా రుబ్బాలి. ఇలా రుబ్బిన కొత్తిమీర సుమారు రెండు వారాల వరకూ తాజాగా ఉంటుంది. కొత్తిమీర ఆకులను చిన్నగా తరగాలి. వాటిని నీళ్లలో వేసి ఐస్‌క్యూబ్స్‌లో ఉంచే ట్రేలలో ఉంచాలి. కొద్ది సేపటి తర్వాత కొత్తిమీర నీటితో పాటుగా గట్టి పడుతుంది. మనకు కావాల్సినప్పుడు వాటిని రిఫ్రిజిరేటర్ నుంచి తీసి బయటపెడితే కొత్తిమీర తాజాగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు