ఈ కాలంలో భార్యాభర్తలు ఉదయాన్ని ఆఫీసులకు బయలుదేరి వెళ్లిపోయి, పొద్దుపోయిన తర్వాత ఇళ్లకు వస్తున్నారు. దీంతో సెలవు చిక్కినప్పుడే కావలసినంత పప్పు, ఉప్పును వంటింటి డబ్బాల్లో కుక్కిపెట్టుకుంటున్నారు. అయితే అవి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి...
తొక్క తీయకుండా...
బంగాళాదుంపలలో పై తొక్కలో విటమిన్-ఎ, విటమిన్-కె, ఐరన్ పుష్కలంగా వుంటాయి. అందువల్ల వీలైనంత వరకు తొక్క తీయకుండా వండుకోవడమే ఉత్తమం.