కూరగాయలు రంగు పోకుండా ఉండాలంటే..?

మంగళవారం, 22 జులై 2014 (15:17 IST)
మార్కెట్‌లో కొనుగోలు చేసే కూరగాయలు రంగు తగ్గకుండా అలానే ఉండాలంటే.. కొనుగోలు చేసిన కూరగాయలను చల్లగా ఉండే నీటిలో ముంచి, ఆ తర్వాత వాడాలి. 
 
సరుకులుంచుకునే డబ్బాల్ని కడిగే సమయంలో చిటికెడు బేకింగ్ సోడా కలిపితే వాటిలోని వాసన పోవడమే కాక, జిడ్డు కూడా వదిలిపోతుంది. 
 
బంగాళాదుంపల చక్రాల్ని ఒక గంట చల్లని నీటిలోనానబెట్టితీసి తడిఆరిన తర్వాత నూనెలో వేయిస్తే కరకరలాడుతుంటాయి. 

వెబ్దునియా పై చదవండి