చేపలను పట్టే జాలర్ల వద్ద చేపలను కొనుగోలు చేయడం ఉత్తమం అని నిపుణులు చెపుతున్నారు. అలా కాకుండా మార్కెట్లకు వెళ్లినప్పుడు చేపలు తాజాగా వున్నాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు. చేపల మొప్పలను తీసి పరిశీలించవచ్చు. అవి ఎర్రగా వుండాలి. అలాగే చేపను చేతితో కాస్త నొక్కి చూస్తే మెత్తగా మీరు వేలు పెట్టినచోట గుంత పడుతుంటే అది బాగా నిల్వ వున్న చేప అని అర్థం చేసుకోవాలి.
చేపలు పట్టుకున్న తర్వాత ఐదు రోజులు తినదగినవిగా ఉంటాయి, కానీ అవి తాజాగా రుచిని కోల్పోతాయి. అందుకే చేపలు పట్టుకున్న వెంటనే ఐసులో పెట్టాలి. అలా పెట్టిన చేపలు డెలివరీ ద్వారా మార్కెట్‌కు అలాగే తేబడాలి. అప్పుడే అవి తాజాగా వుంటాయి.