గురుకులాల్లో కలకలం రేపుతున్న కరోనా - 42 మందికి పాజిటివ్

సోమవారం, 29 నవంబరు 2021 (13:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా, విద్యార్థుల వసతి గృహాల్లో ఈ వైరస్ విజృంభిస్తుంది. తాజాగా మరో 42 మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. 
 
సంగారెడ్డి జిల్లా ముత్తంగి మహాత్మా జ్యోతిరావు పూలే ఇంటర్ కాలేజీకి చెందిన అనేక మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. మొత్తం 42 మంది విద్యార్థులతో పాటు ఓ ఉపాధ్యాయుడు కూడా ఈ వైరస్ బారినపడ్డారు. 
 
ఈ కాలేజీలో మొత్తం 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 261 మంది విద్యార్థులకు 27 మంది సిబ్బందికి ఆదివారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 
 
ఈ పరీక్షల్లో 42 మంది విద్యార్థులకు, ఓ టీచర్‌కు పాజిటివ్ అని వచ్చింది. దీంతో మిగిలిన విద్యార్థులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ సోకిన విద్యార్థులందరినీ హౌం ఐసోలేషన్‌లో ఉంచారు. వీరందరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు జిల్లా ఆరోగ్య శాఖ అధికారి వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు