ఏపీ- తెలంగాణా రాష్ట్రాలలో ఏడవ ఎడిషన్ గిఫ్ట్ వార్మ్ ప్రచారం ప్రారంభించిన రెన్యూ పవర్

శనివారం, 27 నవంబరు 2021 (20:13 IST)
భారతదేశంలో అతిపెద్ద పునరుత్పాదక విద్యుత్ కంపెనీ, రెన్యూపవర్ నేడు తమ వార్షిక గిఫ్ట్ వార్మ్ క్యాంపెయిన్ ఏడవ ఎడిషన్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ ఎడిషన్లో భాగంగా రెండు రాష్ట్రాలలోనూ 12 జిల్లాల్లో 31వేల దుప్పట్లను పంపిణీ చేయనున్నారు. ఈ జిల్లాల్లో భాగంగా తెలంగాణాలో మహబూబ్ నగర్, కామారెడ్డి, వనపర్తి, మంచిర్యాల, మెదక్, వరంగల్ అర్బన్, సంగారెడ్డి ఉన్నాయి.

 
ఈ పంపిణీ కార్యక్రమాలను కంపెనీ యొక్క ఉద్యోగులు తమ ప్లాంట్ ప్రాంగణాలకు సమీపంలో అన్ని భౌతిక దూర మార్గదర్శకాలు అనుసరిస్తూ జిల్లా అధికార యంత్రాంగ సహకారంతో పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని 2015లో కఠినమైన చలిగాలులతో పోరాటం చేయడంలో అవసరార్ధులకు తోడ్పడటమే లక్ష్యంగా ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఈ కార్యక్రమం ద్వారా 1,45,000 దుప్పట్లను విరాళంగా అందజేశారు.

 
ఈ కార్యక్రమం గురించి శ్రీమతి వైశాలి నిగమ్ సిన్హా, చీఫ్ సస్టెయినబిలిటీ ఆఫీసర్, రెన్యూ పవర్ మాట్లాడుతూ, “ఇది గిఫ్ట్ వార్మ్ క్యాంపెయిన్‌కు ఏడవ సంవత్సరం. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 2 లక్షల దుప్పట్లను పంపిణీ చేయాలని ప్రయత్నిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మన సమాజంలో అత్యంత ప్రమాదంలో ఉన్న కమ్యూనిటీలకు మరీముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల తీవ్రంగా ప్రభావిత మయ్యే వారికి తోడ్పడాలనుకుంటున్నాము. ఈ కార్యక్రమం వెనుక ముఖ్యోద్దేశ్యం కేవలం దుప్పట్లను పంపిణీ చేయడం మాత్రమే కాదు, సస్టెయినబుల్ జీవనం పట్ల అవగాహన కల్పించడం మరియు శిలాజ ఇంధనాలపై అధికంగా ఆధారపడిన జీవనశైలి యొక్క కఠిన ప్రభావం పట్ల ప్రజలను విద్యావంతులను చేయడం” అని అన్నారు.

 
శ్రీ జయప్రకాష్, వైస్ ప్రెసిడెంట్- రీజనల్ ఎఫైర్స్ అండ్ డెవలప్మెంట్ మరియు స్టేట్ హెడ్- ఏపీ అండ్ తెలంగాణా మాట్లాడుతూ, “దేశంలో సుప్రసిద్ధ, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలలో ఒకటి రెన్యూ పవర్. ఏపీ- తెలంగాణాలో బాధ్యతాయుతమైన, మోడల్ కార్పోరేట్ సిటిజన్‌గా కూడా రెన్యూ పవర్ చిపరిచితమైంది. కోవిడ్ ఉపశమన ప్రయత్నాలకు మద్దతునందించడానికి అధికా యంత్రాంగంతో మేము కలిసి పనిచేస్తున్నాము. చలితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహాయపడేందుకు కమ్యూనిటీల వ్యాప్తంగా మా కార్యకలాపాలను కొనసాగించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. రాష్ట్ర అధికార యంత్రాంగానికి మేము ధన్యవాదములు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో అవసరార్థులను గుర్తించడం, వారికి సహాయపడడంలో మాకు వారెంతగానో సహకరిస్తున్నారు” అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు