నైనిటాల్ జిల్లాలోని జవహర్ నవోదయ స్కూల్‌లో చదివే విద్యార్థుల్లో తొలుత 11 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో అప్రమత్తమైన ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్కూల్‌లోని 488 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 85 మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో వారిని హాస్టల్‌లోనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కాగా, గత నెల 30వ తేదీన 8 మంది విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆ స్కూల్‌లో చదివే విద్యార్థుల్లో 70 శాతం మంది విద్యార్థులు దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.