దేశంలో కరోనా వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో చాపకింద నీరులా ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. తాజాగా 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు.
న్యూ ఇయర్, బర్త్ డేలు, మరే అకేషన్ అయినా సరే సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరించారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా స్ప్రెడ్ అవుతోందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.