రద్దీగా ఉండే ప్రాంతాలు.. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, పార్కులు, సినిమా థియేటర్లు వంటి ప్రదేశాల్లో డబుల్ మాస్క్ ధరించాలి. మాస్కులను ప్రతిరోజు వేడి నీటితో శుభ్రంగా కడగాలి. మాస్కులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. ఎన్-95 మాస్కులు తీసుకోవడం ఉత్తమం. వాడిన మాస్కులనే వాడకుండా.. కొద్ది రోజులకు కొత్త మాస్కులను కొనుగోలు చేయాలి. అప్పుడే వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చు.