దీనికి ముందు ఆయన రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే రెండు పరీక్షల్లోనూ నిగిటివ్‌నే అని తేలింది. ప్రస్తుతం చేసుకున్నది మూడవసారి. ఇకపోతే.. కరోనా టెస్టుల గురించి, మాస్కు ధరించడం గురించి ఈయన చుట్టూ పెద్ద కాంట్రవర్సీనే నడించింది. దేశాధినేతైనా సరే మాస్క్ ధరించాల్సిందేనన్న బ్రెజిల్ కోర్టు వ్యాఖ్యలను ఆయన అర్థం లేనివిగా కొట్టి పారేశారు.
ఇక కరోనా టెస్టు తరుచూ చేసుకోవడం వల్ల తన ఊపిరితిత్తులు శుభ్రపడుతున్నాయని తెలిపారు. కానీ జైర్ బోల్సోనారో తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బ్రెజిల్‌లోని సావోపాలో గవర్నర్ జాయ్ డోరియా మాట్లాడుతూ బ్రెజిల్‌లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నా అధ్యక్షుడికి ఏమాత్రం పట్టింపు లేదని, కరోనా కంటే బోల్సనారో వైరస్ అత్యంత ప్రమాదకరం అంటూ విమర్శలు గుప్పించారు.