కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ వచ్చేస్తుందని అందరూ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇంకా కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని ప్రపంచ దేశాలు బలంగా నమ్ముతున్నాయి. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవలే అమెరికాలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఫైజర్, మోడెర్నా సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.
వ్యాక్సిన్ తీసుకున్నాక తీవ్రమైన తలనొప్పి, చలి జ్వరం వంటివి రావడంతో కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారం రోజుల తరువాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని, పాజిటివ్ వచ్చినందువలన భయపడాల్సిన అవసరం లేదని ఫైజర్ కంపెనీ చెప్తోంది.