అల్లంతో కరోనావైరస్ చచ్చిపోతుందా? (Video)

ఆదివారం, 2 ఆగస్టు 2020 (21:38 IST)
కరోనావైరస్ దెబ్బకు ఇపుడు అల్లం, పసుపు, మిరియాలు, బెల్లం విపరీతంగా అమ్ముడవుతున్నాయి. దీనికి కారణం వీటితో కషాయం కాచుకుని తీసుకుంటే కరోనావైరస్ అడ్డుకుంటుందనే వాదన.

కానీ ఇది వాస్తవమని ఎక్కడా నిరూపించబడలేదు. అలాగే ఈ కషాయాలు తాగిన వారికి కరోనావైరస్ రాలేదని రుజువులేదు. కానీ కరోనావైరస్ సోకితే అప్పటికే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కనుక మన శరీరం కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు సమర్థవంతంగా వుంటుందనేది కొందరి నిపుణుల మాట.
అసలు అల్లం వల్ల కరోనా వైరస్‌ చచ్చిపోతుందని ఎక్కడా చెప్పలేదు. కానీ అల్లం తీసుకోవడం వల్ల మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా కరోనా తదితర వైరస్‌లతో పోరాడే శక్తిని శరీరం కలిగి వుంటుంది. అల్లంలో ఉండే జింజెరోల్‌ వల్ల దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటివి దరిచేరకుండా అడ్డుకుంటుంది. విపరీతమైన దగ్గు వేధిస్తున్నప్పడు అల్లం, ఉప్పు కలిపి మెత్తగా నూరుకుని తింటే ఉమశమనం కలుగుతుంది.
 
ఆకలిలేమి, వేవిళ్లు, అజీర్తి వంటి రుగ్మతలను తొలగించుకునేందుకు అల్లం యాంటీ యాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అల్లం కంటే శొంఠిలో ఎక్కు ఔషధ గుణాలున్నాయి. అల్లం జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఉదర పేగులో చేరే క్రిములను నశింపజేస్తుంది. లివర్‌ను శుభ్రపరుస్తుంది. ఆకలిలేమితో బాధపడేవారు.. అల్లం, కొత్తిమీర తరుగుతో పచ్చడి తయారుచేసుకుని తీసుకోవడం మంచిది. 
గొంతునొప్పికి అల్లం రసం మెరుగ్గా పనిచేస్తుంది. కానీ అల్లాన్ని మితంగా తీసుకోవాలి. ఇక అల్లం రసాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే వ్యాధులు దరిచేరవు. బరువు తగ్గుతారు. అల్లం పచ్చడి గొంతు నొప్పి, ఛాతి నొప్పిని దూరం చేస్తుంది. అల్లం రసంలో బెల్లం కలుపుకుని తాగితే వాత సమస్యలు దూరమవుతాయి. అల్లం, పుదీనా పచ్చడిని తీసుకుంటే పిత్త, అజీర్తి దూరమవుతుంది. నోటి దుర్వాసన ఉండదు. చురుగ్గా ఉంటారు. కడుపు ఉబ్బరం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
 




 

అల్లం తొక్కను తీసేయకుండా అలానే దంచేస్తే మాత్రం అపాయం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎందుకంటే? అల్లం తొక్కలో విషపదార్థాలుంటాయట. ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని.. అందుకే అల్లం ఉపయోగించేటప్పుడు తొక్క తీసేయడం చాలా మంచిదని వారు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు