క్యాంటిన్ వ్యాపారిపై కరోనా దెబ్బ, ఇది కరోనా మందు అంటూ విషం తాగించాడు

శనివారం, 12 సెప్టెంబరు 2020 (13:59 IST)
కరోనాతో ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా  రాకుండా ఉండేందుకు మందు తెచ్చానని తండ్రికి తాగించి, తాను కూడా తాగాడు. యువకుడు మృతి చెందగా అతని తండ్రి చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నాడు.
 
అనీష్‌ రెడ్డి ఐటీ సంస్థల్లో క్యాంటీన్లు నిర్వహిస్తుంటాడు. ఆరు నెలలుగా కరోనా వల్ల ఐటీ సంస్థలన్నీ వర్క్‌ ఫ్రమ్ హోం పెట్టాయి. దీంతో ఇతని క్యాంటీన్‌ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. తీవ్ర మనస్థాపానికి గురైన అనీష్‌ రెడ్డి గత కొంత కాలంగా తీవ్రంగా మానసిక క్షోభలో ఉన్నాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకును చనిపోతే ఈ ఏజ్‌లో తల్లిదండ్రులు ఎలా బతుకుతారు అనుకున్నడో ఏమో అనీష్‌ రెడ్డి పాయిజన్‌ను ఇంటికి తీసుకువచ్చాడు.
 
ఇది కరోనా రాకుండా ఉండే మందు అని తండ్రికి తాగించి తాను కూడా త్రాగాడు. తల్లి పనిలో ఉండటంతో తరువాత తాగుతానని చెప్పింది. పది నిమిషాల తర్వాత తల్లి వంటగది నుండి బయటకు రాగా ఇద్దరూ వాంతులు చేసుకుంటున్నారు. దీంతో కంగారు పడ్డ శ్రావణి రెడ్డి ఇరుగుపొరుగు వారి సాయంతో ఆంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఇద్దర్నీ సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అనీష్‌ రెడ్డి మృతి చెందగా, రామిరెడ్డి తీవ్ర అస్వస్థకు గురయ్యాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు