ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మృత్యుఘంటికలు మోగిస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 68 మంది చనిపోయారు. అలాగే కొత్త కేసుల నమోదులో కూడా అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రతి రోజూ ఏకంగా 10వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 10,175 కొత్త కేసులు నమోదయ్యాయి.
వీటిలో తూర్పుగోదావరి జిల్లాలో 1,412 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,386 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,37,687కి పెరిగింది. ఇదేసమయంలో గత 24 గంటల్లో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 4,702 మంది కరోనా బారిన పడి చనిపోయారు. గత 24 గంటల్లో 72,229 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.
ఇకపోతే, జిల్లాల వారీగా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం జి్లాలో 4966 కేసులు ఉండగా, చిత్తూరులో 8747, ఈస్ట్ గోదావరిలో 12763, గుంటూరులో 7803, కడపలో 7942, కృష్ణలో 3051, కర్నూలులో 4438, నెల్లూరులో 5782 చొప్పున ఉన్నాయి.
అలాగే, ప్రకాశంలో 15099, శ్రీకాకుళంలో 6657, విశాఖపట్టణంలో 6023, విజయనగరంలో 9314, వెస్ట్ గోదావరిలో 4663 చొప్పున మొత్తం 97338 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 4702 మంది కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు.