ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు గజగజ వణికిపోతున్నారు. ఎవరు తుమ్మినా, దగ్గినా భయపడే పరిస్థితులు నెలకొన్నాయ. సాధారణ జలుబు చేసినా కరోనా సోకిందేమోనన్నా భయం ప్రజలను వెంటాడుతుంది. ఈ పరిస్థితుల్లో ఎవరు కరోనా టెస్టు చేసుకోవాలనే దానిపై కేంద్ర వైరోగ్యశాఖ కొన్ని సూచనలు చేసింది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. పైగా, ఎవరెవరు ఈ పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాం.
* వైద్యరంగంలో పనిచేస్తున్న వారందరూ కూడా టెస్ట్ చేసుకోవాలి.
* ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన, పొందుతున్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాల్సిందే.