దేశంలో కొత్తగా మరో 30773 పాజిటివ్ కేసులు

ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (10:20 IST)
దేశంలో కొత్తగా మరో 30 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 30,773 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల మొత్తం సంఖ్య‌ 3,34,48,163కి చేరింది. 
 
అలాగే, శనివారం 38,945 మంది కోలుకున్నార‌ని తెలిపింది. దేశంలో క‌రోనాతో మ‌రో 309 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,44,838కి పెరిగింది. 
 
ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,26,71,167 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 3,32,158 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. శనివారం దేశంలో 85,42,732 వ్యాక్సిన్ డోసుల‌ను ప్ర‌జ‌ల‌కు వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 80,43,72,331  డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు