దేశంలో కొత్తగా మరో 15 వేల పాజిటివ్ కేసులు

శుక్రవారం, 22 అక్టోబరు 2021 (10:28 IST)
దేశంలో కొత్తగా మరో 15,786 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఈ వైరస్ సోకిన వారిలో 231 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,75,745 మంది చికిత్స తీసుకుంటున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, ఇప్ప‌టివ‌ర‌కు 3,35,14,449 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 4,53,042కు చేరుకుంది. నిన్న దేశ వ్యాప్తంగా 13,24,263 క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ప‌రీక్షించిన మొత్తం శాంపిళ్ల సంఖ్య 59,70,66,481కు చేరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు