శిక్షణలో భాగంగా ఈ విమానం ఉదయం సెంట్రల్ సెక్టార్ నుంచి గాల్లోకి ఎగిరింది. అనంతరం ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలిలో విమానం తోక భాగం నేలలో కూరుకుపోయి కనిపిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు వాయుసేన భావిస్తోంది. ఈ ప్రమాదానికి కారణాలను అన్వేషించేందుకు వాయుసేన విభాగం దర్యాప్తు ప్రారంభించింది. అసలు మిరాజ్ 2000 ఫైటర్ జెట్ విమానం తనంతట తాను సాంకేతిక లోపంతో కుప్పకూలిందా? మరేదైనా కారణాలున్నాయా అనే దిశలో విచారణ చేస్తున్నారు.