గర్భిణులకు కరోనా పాజిటివ్ - కమ్యూనిటీ ట్రాన్స్‌మిషనా?

సోమవారం, 18 మే 2020 (08:28 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు హడలిపోతున్నారు. తాజాగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 13 మంది గర్భిణులకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని ప్రభుత్వ క్వారంటైన్‌ హోంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రారంభంకావడం వల్లే వీరికి ఈ వైరస్ సోకివుంటుందన్న భావిస్తున్నారు. 
 
అనంతనాగ్ జిల్లాకు చెందిన 13 మంది గర్భిణులు మరో వారంలో ప్రసవించాల్సివుంది. అయితే, వారిలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ ఫలితాల్లో వారికి కరోనా సోకినట్టు తేలింది. ఇందులో ఏడు మంది గర్భిణిలు కరోనా వైరస్ హాట్‌స్పాట్ జోనులో నివసిస్తున్నారు. ఇక్కడ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రారంభమైందా అని వైద్యులు ఆందోళన చెందుతున్నారు.
 
దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ రెడ్ జోన్‌లో నివసించేవారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కాగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మొత్తం 1121 కరోనా పాజిటివ్ కేసులు నమోదైవున్నాయి. ఆదివారం కూడా కొత్తగా మరో 62 కేసులు కూడా నమోదైవున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు