దేశంలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (10:55 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గింది. ఈ కారణంగానే రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 44,877 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
ప్రస్తుతం దేశంలో 5,37,045 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. రోజువారీగా పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉంది. 
 
ఇకపోతే, గత 24 గంటల్ల కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారిలో 1,17,591గా వుంది. ఇప్పటివరకు కరోనా మొత్తం కేసుల సంఖ్య 4,15,85,711గా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు