ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగా, గురువారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ జరుగుతోంది. అయితే, ఈ ఎన్నికల తర్వాత దేశంలో భారీగా పెట్రోల్, డీజల్ ధరల బాంబు పేలనుంది. లీటరు పెట్రోలుపై రూ.8 నుంచి రూ.9 మేరకు పెరగనుంది. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ధరలను పెంచేందుకు చమురు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని డెలాయిట్ టచీ తోమత్సు ఇండియా సంస్థ భాగస్వామి దేబాశిష్ మిశ్రా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు చుమురు, గ్యాస్ధరల్లో ఎలాంటి మార్పులేదు.