దేశంలో రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. అదేసమయంలో ఈ వైరస్ బారినపడి కోలుకుంటున్న బాధితుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 58,077 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,25,36,137కు చేరింది. ఈ కేసుల్లో 4,13,31,158 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 6,97,802 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,07,177 మంది కోవిడ్ బాధితులు మృత్యువాతపడ్డారు.
అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 1,50,407 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని, మరో 657 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. అదేసమయంలో రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతోపాటు రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 97.17 శాతానికి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.