గత 24 గంటల్లో మొత్తం 491 కేసులు నమోదయ్యాయి. వీరిలో స్థానికులు 390 మందికాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 83 మంది, విదేశాల నుంచి వచ్చినవారు 18 మంది ఉన్నారు. కోవిడ్ కారణంగా కృష్ణాలో ఇద్దరు, కర్నూల్‌లో ఇద్దరు, గుంటూరులో ఒకరు మృతి చెందారు. స్థానికంగా ఉన్నవారిలో 138 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
ఇకపోతే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో తాజాగా 83 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 1506 మందికి పాజిటివ్ కాగా ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 647 మంది. డిశ్చార్జ్ అయినవారు 859 మంది.
అలాగే, విదేశాల నుంచి వచ్చిన వారిలో తాజాగా 18 మంది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 326 కేసులు నమోదు కాగా, 277 మంది చికిత్స పొందుతున్నారు.. 49 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇక జిల్లాల వారీగా నమోదైన మొత్తం కేసులను పరిశీలిస్తే, అనంతపురంలో మొత్తం కేసులు 789, చిత్తూరులో 515, ఈస్ట్ గోదావరిలో 485, గుంటూరులో 742, కడపలో 330, కృష్ణలో 982, కర్నూలులో 1247, నెల్లూరులో 459, ప్రకాశంలో 175, శ్రీకాకుళంలో 59, విశాఖపట్టణంలో 261, విజయనగరంలో 78, వెస్ట్ గోదావరిలో 498 చొప్పున నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో నమోదైన పాజిటివ్ కేసుల సంక్య 1506గా ఉంది.