భారత్‌లో కొత్తగా 37,148 కరోనా పాజిటివ్ కేసులు

బుధవారం, 22 జులై 2020 (11:28 IST)
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరిగి పోతున్నది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 37,724 కేసులు నమోదు కాగా 648 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 28,492 మంది కోలుకొని డశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ తెలిపింది. కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల మేరకు దేశం మొత్తంలో 11,92,915 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,11,113 ఉండగా 7,53,049 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇదిలా ఉండగా 28,732 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,43,243 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేసారు. ఇప్పటి వరకు దేశంలో 1,47,24,546 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు