తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఏపీలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 1 లక్ష దాటగా, కరోనా మృతుల సంఖ్య 1000 దాటింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 6,051 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,210 కేసులు రాగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 120 కేసులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,349కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మరో 49 మంది మృతి చెందగా, ఇప్పటివరకు సంభవించిన మరణాల సంఖ్య 1,090కి పెరిగింది. తెలంగాణలో కోవిడ్-19 కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది.
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల్లో 9,817 మంది నమూనాలను పరీక్షించగా, వారిలో 1,473 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 506 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 55,532 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 12,955 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 42,106 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 471కి చేరింది.