దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 68,020 మంది కరోనా బారినపడ్డారు. గతేడాది అక్టోబర్ తర్వాత ఒకేరోజు ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,39,644కు చేరింది. ఇందులో 1,13,55,993 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 1,61,843 మంది మరణించారు.
కాగా, కరోనా బాధితుల సంఖ్య అధికమవుతుండటంతో దేశంలో యాక్టివ్ కేసులు ఐదు లక్షలు దాటాయి. మొత్తం కేసుల్లో 5,21,808 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే ఆదివారం మహమ్మారి వల్ల 291 మంది మరణించగా, మరో 32,231 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 6,05,30,435 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా 24,18,64,161 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. ఇందులో మార్చి 28న 9,13,319 నమూనాలను పరీక్షించామని తెలిపింది.