దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో కూడా మరో 2958 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49436కు చేరింది. అలాగే, ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 126గా ఉండగా, మొత్తం 1695 మంది ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి చనిపోయినట్టు కరనా వైరస్ వరల్డ్ మీటర్ వెల్లడిస్తోంది.
మరోవైపు, పలు నివేదికల ప్రకారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 548 మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి ఈ వైరస్ సోకినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది వైద్యులకు వైరస్ సోకినట్టు వార్తలు నిర్ధారణ అయిన విషయం తెల్సిందే. దీంతో వైద్యులు విధులు నిర్వహించాలంటే భయపడిపోతున్నారు. ముఖ్యంగా, 60 యేళ్లు పైబడిన వైద్యులు కరోనా రోగులకు చికిత్స చేయాలంటే హడలిపోతున్నారు.