కరోనా కేసులకు హాట్‌స్పాట్‌‌గా హైదరాబాద్.. ఐకియాకు కోవిడ్ సెగ

శనివారం, 18 జులై 2020 (09:16 IST)
IKEA
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తెలంగాణలో పదుల సంఖ్యలో ఉండే కేసులు వందలు దాటాయి. ఇప్పుడు రోజుకు 2వేల చేరువలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక, కరోనా కేసులకు హైదరాబాద్ హాట్‌స్పాట్‌గా ఉంది.. ప్రతీ రోజు నమోదవుతున్న కేసుల్లో అగ్రభాగం హైదరాబాద్‌దే. తాజాగా  కరోనా సెగ స్వీడిష్ రిటైల్ సంస్థ ఐకియాను కూడా తగిలింది.
 
కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో.. హైదరాబాద్‌లోని స్టోర్‌ను మళ్లీ తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది ఐకియా. ఈ మేరకు 18వ తేదీ నుంచి సంస్థ మూతపడనున్నట్లు ఐకియా స్టోర్ తెలిపింది. 
 
దీనిపై ఇప్పటికే కస్టమర్లకు మెయిల్స్ పంపించారు. ఐకియా ఇండియా సీఈవో అండ్ సీఎస్‌వో పీటర్ బెట్జెల్ పేరిట రాసిన లేఖను కంపెనీ వెబ్‌సైట్, సోషల్ మీడియా ద్వారా కస్టమర్లకు అందుబాటులో ఉంచారు. అయితే, త్వరలోనే తిరిగి స్టోర్‌ను తెరుస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది ఐకియా.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు