అయితే ఎత్తయిన పర్వతాలను ఎక్కుతున్నప్పుడు కొంతమందికి 'పల్మనరీ ఎడిమా' అనే లక్షణాలు, సిక్ నెస్ కనబడుతాయట. నిజానికి ముగ్గురు పర్వతారోహకులకు కోవిడ్ పాజిటివ్ సోకిందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. వీరిని వెంటనే బేస్ క్యాంపు నుంచి తరలించినట్టు పేర్కొంది.
2019లో 11 మంది పర్వతారోహకులు మరణించారు. కాగా- చాలా వరకు వైరస్ లక్షణాలు ఆల్టిట్యుడ్ సిక్ నెస్‌ని, సాధారణంగా పర్వతారోహకులను వేధించే 'కుంభ్ దగ్గును' పోలి ఉంటాయని అంటున్నారు. నేపాల్‌లో సైతం కేసులు పెరిగిపోతున్నప్పటికీ అక్కడి ప్రభుత్వం ఈ కేసులు పెరగకుండా ముందు జాగత్త చర్యలు తీసుకుంటోంది. ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయో తెలియడంలేదని, చాలానే ఉంటాయని భావిస్తున్నామని ఓ సాహస యాత్రా బృంద నేత ఒకరు అన్నారు.