దీనికోసం 8 ఖాళీ ట్యాంకులను హైదరాబాద్ నుంచి విమానాల్లో తీసుకెళ్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్‌కుమార్ బేగంపేట విమానాశ్రయంలో ప్రక్రియను పరిశీలించారు. సత్వరమే ఆక్సిజన్ తీసుకొచ్చేందుకు వీలుగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది.