భారత్‌లో కరోనా ప్రభావం .. కోటి మందిలో ఏడుగురికి సోకిన వైరస్

ఆదివారం, 29 మార్చి 2020 (09:02 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళించింది. ఈ వైరస్ ఇప్పటికే 199 దేశాలకు వ్యాపించింది. ఈ వైరస్ మహమ్మారిబారినపడి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో ఈ వైరస్ వ్యాప్తితో పాటు ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య తక్కువగా ఉందని చెప్పొచ్చు. ఆదివారం ఉదయానికి ఈ కరోనా వైరస్ కేసుల సంఖ్య వెయ్యికి చేరింది. 
 
మరోవైపు, కేసులు/జనాభా నిష్పత్తి ఆధారంగా విశ్లేషిస్తే.. మన దేశంలో ప్రతి 10 లక్షల మందిలో 0.7 మందికి మాత్రమే వైరస్‌ సోకింది. అంటే.. కోటి మందిలో ఏడుగురు బాధితులు ఉన్నట్టు లెక్క. సమూహవ్యాప్తి దశకు చేరకముందే వైరస్‌ను కట్టడి చేస్తేనే సురక్షితంగా ఉంటామని నిపుణులు చెప్తున్నారు. ఇందుకు అనుగుణంగా కేంద్రం లాక్‌డౌన్‌తోపాటు అనేక ఏర్పాట్లు చేస్తోంది. 
 
మరోవైపు, కరోనా పోరాటంలో రైల్వే శాఖ కూడా తనవంతు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులోభాగంగా, వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రైలు బోగీలను ఐసోలేషన్ బోగీలుగా మార్చుతోంది. ఓ జనరల్‌ బోగీని ఐసొలేషన్‌ వార్డుగా మార్చిన చిత్రాలను శనివారం మీడియాకు విడుదలచేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు