అయితే, ఈ పొగాకు వ్యాపారి స్థానిక ఎమ్మెల్యేకు బంధువు. పైగా, ఈ ఎమ్మెల్యేతో పొగాకు వ్యాపారి కలిసి మాట్లాడినట్టు, తిరిగినట్టు ప్రచారం జరిగింది. దీంతో ఆ ఎమ్మెల్యేతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌కు అధికారులు తరలించారు. అయితే, ఆ ఎమ్మెల్యే పేరు, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనే విషయాన్ని మాత్రం అధికారులు బహిర్గతం చేయలేదు.
కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆ ఎమ్మెల్యే వైకాపాకు చెందిన మహ్మద్ ముస్తాఫా షేక్ అని, గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై అధికారులు క్లారిటీ ఇవ్వాల్సివుంది.