విజయవాడ దుర్గగుడిలో కరోనా కలకలం, ఈవో సహా 18 మందికి పాజిటివ్

శుక్రవారం, 7 ఆగస్టు 2020 (13:36 IST)
నిత్యం భక్తులతో కళకళలాడే విడయవాడ దుర్గ గుడిలో కరోనా కల్లోలం రేపుతుంది. కరోనా వ్యాప్తి కారణంగా రెండున్నర నెలలకు పైగా గుడిని మూసివేసిన అధికారులు తాజాగా కేంద్రం ఆంక్షలు సడలింపుతో తిరిగి దర్శనాలు ప్రారంభించారు. అయితే పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నా కరోనా వ్యాప్తి చెందుతుండటంతో వాటిలోను కోతలు పెట్టారు.
 
ఇదంతా సాగుతుండగా తాజాగా ఆలయ నిర్వహణాధికారి సరేశ్‌తో పాటు 18 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. తాజాగా నిర్వహించిన పరీక్షలో వీరికి వైరస్ సోకినట్లు నిర్థారించారు. ఇవాళ అసలే శ్రావణ శుక్రవారం కావడం, భక్తులు ఎక్కువగా ప్రత్యేక పూజలు కోసం తరలి వస్తుండటంతో కరోనా భయాలు మరింత పెరిగాయి.
 
ఇప్పటికే ఆలయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దాఖలాలు కనిపిస్తున్నా భక్తుల రాక మాత్రం తగ్గలేదు. దీంతో అధికారులు కూడా తలలు పట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. భక్తులను వెనక్కు పంపలేని పరిస్థితిలో దర్శనాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తున్నది. అధికారులకు కరోనా సోకడంతో ఆలయాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించేటట్లు చర్యలు జరుగుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు