కరోనా మాస్కులు ధరించారా? పొరపాటున కూడా ఈ పని చేయొద్దు!

గురువారం, 5 మార్చి 2020 (14:46 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలోని వుహాన్ నగరంలో పురుడుపోసుకున్న ఈ వైరస్ ఇప్పటికే 65 దేశాలకు పాకింది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 3 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోగా, వేలాది మందికి ఈ వైరస్ సోకింది. పైగా, ఈ వైరస్ గాలిద్వారా శరవేగంగా విస్తరిస్తోంది. 
 
ఈ కరోనా కలకలంతో ప్రపంచ వ్యాప్తంగా మాస్కులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రజలంతా ఒక్కసారిగా మాస్కుల కోసం ఎగబడటంతో మాస్కుల కొరత ఏర్పడింది. ముఖ్యంగా, హైదరాబాద్‌ నగరంలో ఓ పాజిటివ్ కేసు నమోదు కావడంతో తెలుగు రాష్ట్రాలకు కూడా కరోనా భయం పట్టుకుంది. కరోనా నుంచి కాపాడుకోవడానికి మాస్క్‌లను ధరిస్తున్నారు. 
 
అయితే, కరోనా వైరస్ మాస్క్‌ ధరించిన వ్యక్తికి వ్యాప్తి చెందదా? అనే ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది. ఈ ప్రశ్నకు వైద్య నిపుణులు చెబుతున్న సమాధానం ఏంటంటే.. ఏ వైరస్ అయినా గాలి ద్వారా త్వరితగతిన వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని.. కరోనా అందుకు మినహాయింపేమీ కాదన్నారు. అయితే, మాస్క్ ధరించిన వ్యక్తులు తమ చేతులతో పొరపాటున కూడా ముక్కును, నోటిని తాకొద్దని.. చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాతే తాకాలని వైద్యులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు