18 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 28,500 మందిని ఈ అధ్యయనం కవర్ చేసింది. 10 రాష్ట్రాలలో అంటే.. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, పాట్నా మరియు లక్నోతో సహా 19 ప్రదేశాల్లో ఈ వ్యాక్సిన్‌కి సంబంధించి ట్రయల్స్ నిర్వహిస్తున్నామని భారత్ బయోటెక్ పేర్కొంది.
మొదటి, రెండు దశల్లో క్లినికల్ ట్రయల్స్ మరియు జంతువులలో పరీక్షించిన అధ్యయనం తర్వాత ఆ డేటాను అంచనా వేసి తరువాత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిస్కో) ప్యానెల్ అనుమతి ఇవ్వాలని సిఫారసు చేసింది.