గత కొన్ని వారాలుగా ఆసియా అంతటా కోవిడ్-19 కేసులు పెరిగాయి. ఆసియాలోని అతిపెద్ద నగరాల్లో రెండు హాంకాంగ్- సింగపూర్‌లలో గణనీయమైన సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. హాంకాంగ్‌లోని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ ప్రకారం, హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్‌లోని ఆరోగ్య అధికారులు కొత్త బూస్టర్ టీకాలు తీసుకోవాలని ప్రజలను కోరారు.
జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల కేసుల పెరుగుదల ఉండవచ్చు. భారతదేశంలో తాజా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కూడా యాక్టివ్ కేసుల పెరుగుదల నమోదైంది. ఒక వారంలో 12 నుండి 56కి పెరిగింది. ప్రస్తుతం, భారతదేశంలో 257 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు గరిష్ట కేసులను నివేదించాయి. ఈ క్రమంలో భారతదేశంలో 257 కేసులు నమోదయ్యాయి.
కొత్త వేరియంట్ ఉందా?
ఓమిక్రాన్ కుటుంబానికి చెందిన JN.1 వేరియంట్, దాని సంబంధిత వారసులు ఆసియా అంతటా కోవిడ్-19 కేసుల పెరుగుదలకు చోదక శక్తిగా భావిస్తున్నారు. సింగపూర్ ఆరోగ్య అధికారుల ప్రకారం, JN.1 వేరియంట్ యొక్క వారసులు అయిన LF.7, NB.1.8 అనే కొత్త వేరియంట్‌లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.