దేశాన్ని కరోనా వైరస్ మహమ్మారి కమ్మేస్తోంది. రెండో దశ వ్యాప్తి తీవ్రంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తరకం కరోనా వైరస్ రకాలు (స్ట్రెయిన్లు) మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. రెట్టింపు స్థాయిలో ఉత్పరివర్తనం చెందిన కొత్త వైరస్‌ను (న్యూ డబుల్ మ్యూటెంట్ వేరియెంట్‌ను) మహారాష్ట్ర, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో తాజాగా గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది.
అలాగే, 18 రాష్ట్రాల్లో ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్న కొత్తరకం వైరస్ రకాలను గుర్తించినట్టు వివరించింది. ఇందులో కొన్ని స్ట్రెయిన్లు బ్రెజిల్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లో గుర్తించిన వైరస్ రకానికి చెందినవని, వాటి తీవ్రత ఆందోళన కలిగిస్తున్నదన్నది. అయితే, ఇటీవల పెరుగుతున్న కరోనా కేసులకు ఈ కొత్త రకం వైరస్‌లే కారణమని ఇప్పుడే చెప్పలేమని వివరించింది.
అలాగే వ్యాక్సిన్ నుంచి కూడా తనను తాను రక్షించుకోగలదన్నారు. అయితే, ఎలాంటి స్ట్రెయిన్లు కలిసి డబుల్ మ్యుటేషన్ వైరస్ ఏర్పడిందన్న వానిపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటేనే దీని నుంచి బయటపడగలమన్నారు.