కరోనా వైరస్ మహమ్మారిని సాకుగా చూపి భారతీయ విద్యార్థులపై చైనా కక్షగట్టింది. స్వదేశంలోకి అడుగుపెట్టొద్దని కోరుతోంది. ఇందుకోసం కరోనా వైరస్‌తో పాటు.. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలను సాకుగా చూపుతోంది. పైగా, ఈ ఆంక్షలను మరోమారు పొడగించింది.
భారతీయ విద్యార్థులు మరికొంత కాలం ఆన్‌లైన్‌లోనే తరగతులకు హాజరు కావాలని సూచించింది. ముఖ్య సమాచారం కోసం యూనివర్సిటీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ సూచనలు పాటించాని సూచించింది. భారతీయ విద్యార్థుల సమస్యలను చైనాలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం ఆ దేశ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో చైనా ఈ వ్యాఖ్యలు చేసింది.
అయితే, అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలను సాకుగా చూపుతున్న చైనా.. భారతీయ విద్యార్థులపై మాత్రం ఆంక్షలు విధిస్తోంది. ప్రత్యక్ష తరగతులకు హాజరుకాకుండా అడ్డుకుంటోంది. మరింత కాలం సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు ఆన్‌లైనా క్లాసుల ద్వారా హాజరు కావాలని సూచిస్తోంది.