గాల్లో ఎగరేస్తూ రఘు వడా పావ్ తయారు చేస్తున్నాడు. కాగా, అతడు వడాపావ్ తయారు చేస్తున్న వీడియోను 'ఆమ్చీ ముంబై' అనే ఫుడ్ వ్లాగర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
గాల్లో ఎగరేస్తూ వడా పావ్ తయారు చేసే విధానాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గాల్లోకి ఎగరేస్తూ వడా పావ్ తయారుచేసే విధానం ప్రస్తుతం ముంబైలోనే కాకుండా దేశమంతటా పాపులర్ అవుతోంది. కాగా, క్షణాల్లో ఈ వీడియో వైరల్ అవ్వగా నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఈ వీడియోను చూసిన ఒక నెటిజన్ ఫ్లయింగ్ వడా పావ్ అద్భుతంగా ఉందంటూ కామెంట్ చేయగా.. మరొకరు.. ఫైయింగ్ పానీ పూరి ప్లీజ్ అంటూ ఫన్నీగా వ్యాఖ్యానించాడు. ఇప్పటివరకు 2.62 లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాదించిన ఈ వీడియో, దాదాపు 6 నిమిషాల పాటు ఉంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.