తెలంగాణ ఏడు జిల్లాల్లో కరోనా కేసులు నిల్!

సోమవారం, 26 అక్టోబరు 2020 (14:05 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమేణా తగ్గుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 582 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఏడు జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. 
 
గత 24 గంటల్లో కరోనా బారిన పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,611 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 2,31,834కి చేరుకుంది. మొత్తం 1,311 మంది మృతి చెందారు. 
 
గత 24 గంటల్లో జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరం భీమ్ ఆసిఫాబాద్, ములుగు, నారాయణపేట్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 174, నల్గొండ జిల్లాలో 87, రంగారెడ్డి జిల్లాలో 55, మేడ్చల్ జిల్లాలో 38, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 కేసులు నమోదయ్యాయి. 
 
మిగిలిన జిల్లాల్లో ఆదిలాబాద్ 9, జగిత్యాల్‌ 14, జనగాం 2, జోగులమ్మ గద్వాల్‌ 4, కరీంనగర్‌ 15, ఖమ్మం 17, మహబూబ్‌ నగర్‌ 15, మహబూబాబాద్‌ 13, మంచిర్యాల్‌ 2, మెదక్‌ 4, నాగర్‌ కర్నూల్‌ 6, నల్గొండ 87, నిజామాబాద్‌ 24, రాజన్న సిరిసిల్ల 4, సంగారెడ్డి 31, సిద్ధిపేట్‌ 15, సూర్యాపేట 4, వికారాబాద్‌ 4, వనపర్తి  1, వరంగల్‌ రూరల్‌ 7, వరంగల్‌ అర్బన్‌ 13, యాద్రాది భువనగిరి 2 కేసులు నమోదయ్యాయి. 
 
80 లక్షలకు చేరిన కరోనా కేసులు 
మన దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖంపడుతోంది. గత 24 గంటల్లో 45,149 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,09,960కి పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో కరోనా కారణంగా 480 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 1,19,014కి పెరిగింది. 
 
ఇక 24 గంటల్లో 59,105 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 6,53,717 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 71,37,229 మంది కోలుకున్నారు. మరోవైపు, త్వరలోనే రెండో దశ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కొందరు చెపుతున్న నేపథ్యంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు