తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా.. 24 గంటల్లో 12మంది మృతి

శుక్రవారం, 7 ఆగస్టు 2020 (10:01 IST)
తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజు కూడా కరోనా కేసుల తీవ్రత పెరుగుతుంది. తెలంగాణలో కొత్తగా 2207 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి చెందారు. ప్రస్తుతం 75,257కి పాజిటివ్ కేసులు పెరిగాయి. మరణాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
సెప్టెంబర్ చివరి నాటికి హైదరాబాద్‌లో కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో 80 నుంచి 90 శాతం పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తెలంగాణాలో ఇప్పటి వరకు 601 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
యాక్టివ్ కేసులు 21 వేల 417గా ఉండగా కోలుకున్న వారి సంఖ్య 53వేల239కి చేరుకుంది. తెలంగాణాలో రికవరీ రేటు 70.7 శాతంగా ఉంది. రికవరీ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. గురువారం ఒక్క రోజే 23 వేల మందికి కరోనా పరీక్షలు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు