బారన్ ట్రంప్‌కు లక్షణాలు లేకుండా సోకిన కరోనా!

గురువారం, 15 అక్టోబరు 2020 (10:23 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారుడు బారన్ ట్రంప్‌కు కరోనా వైరస్ సోకింది. అయితే, ఈ కుర్రోడిలో ఎలాంటి వైరస్ లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ వెల్లలడించారు. 
 
కరోనా వైరస్ బారినపడిన డోనాల్డ్ ట్రంప్ ఇటీవలే కోలుకున్న విషయం తెల్సిందే. ఈ నెల 2న ట్రంప్, మెలానియాలకు వైరస్ సోకింది. ఆపై ట్రంప్ మూడు రోజుల పాటు ఆసుపత్రిలోనూ చేరాల్సి వచ్చింది. ట్రంప్ కోలుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, మెలానియా ఇంకా క్వారంటైన్ లో ఉన్నారు.
 
వీరి ద్వారానే ఆయన కుమారుడు బారన్ ట్రంప్‌కు కూడా ట్రంప్ నుంచే వైరస్ సోకివుండొచ్చని భావిస్తున్నారు. అయితే, బారన్‌లో వైరస్ లక్షణాలు లేవని, అయితే, తాజాగా నమూనాలను పరీక్షించగా, కరోనా సోకినట్టు తేలిందని అన్నారు. ప్రస్తుతం బారన్‌కు చికిత్స జరుగుతోందని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు