దీంతో, దేశ అవసరాలకు సరిపడా టీకా ఉత్పత్తి చేసేందుకు కేంద్రం కూడా సీరం పైనే ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కరోనా టీకాను కేవలం రూ.250కే అందిస్తామంటూ సీరం ఇన్‌స్టిట్యూట్ కేంద్రానికి ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.
ఆక్సఫర్డ్ టీకా ధర రూ.వెయ్యి వరకూ ఉండొచ్చంటూ సీరం సీఈఓ ఆధార్ పూనావాలా గతంలో ప్రకటించారు. అయితే, టీకాల కోసం ప్రభుత్వాలు భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న నేపథ్యంలో టీకా ధరలు దిగివచ్చే అవకాశం ఉందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి.