ఏపీలో కొత్తగా 137 కరోనా పాజిటివ్ కేసులు

శనివారం, 18 డిశెంబరు 2021 (18:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 137 మందికి కరోనా వైరస్ సోకింది. మొత్తం 31,855 మందికి ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. మొత్తం నమోదైన 137 పాజిటివ్ కేసుల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 28 మందికి ఈ వైరస్ సోకింది. 
 
అలాగే, పశ్చిమగోదావరి జిల్లాలో 23, తూర్పు గోదావరి జిల్లాలో 16, విశాఖపట్టణంలో 14 కేసులు చొప్పున నమోదు కాగా, విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఇదిలావుంటే, ఈ వైరస్ బారినపడి విశాఖలో ఒక రోగి ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 189 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,705 యాక్టివ్ కేసులు ఉండగా, కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,478కు చేరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు