కరోనావైరస్‌తో మరణించిన వైద్యుడి కుటుంబానికి రూ. కోటి చెక్కు అందించిన కేజ్రీవాల్
శుక్రవారం, 3 జులై 2020 (20:40 IST)
కరోనా వైరస్‌ను తరిమికొట్టడంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికుల పోరాటం వెలకట్టలేనిది. తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ క్రమంలో కొందరు వైద్యులు కరోనావైరస్ బారిన పడుతున్నారు.
ఈ క్రమంలో ఢిల్లీలోని ఎల్‌ఎన్జేపీ దవాఖానకు చెందిన సీనియర్ వైద్యుడు డాక్టర్ అసీం గుప్తాకు కరోనావైరస్ సోకింది. ఆ వైరస్ నుంచి బయటపడేందుకు ఆయన పోరాటం చేశారు. కానీ జూన్28న తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.
వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనావైరస్ నిరోధించేందుకు పోరాడుతున్నారని అన్నారు. చనిపోయిన వైద్యుడు అసీం కుటుంబానికి కోటి రూపాయల చెక్కును పరిహారంగా అందజేసారు.