మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, కర్ణాటకలో ఈ వేరియంట్ విస్తరించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించగా మహారాష్ట్రలో అత్యధికంగా ఇప్పటివరకు 21 డెల్టాప్లస్ కేసులను గుర్తించారు. ఈ వేరియంట్‌తోనే ఇప్పుడు అక్కడ మూడోముప్పు పొంచి ఉందని ఆరోగ్యశాఖ ఇదివరకే అంచనా వేసింది.
మరోవైపు కేరళలో మూడు కేసులు, కర్ణాటకలో రెండు, మధ్యప్రదేశ్‌లో ఒక కేసు బయటపడినట్టు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. డెల్టాప్లస్ వేరియంట్ మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్ ఔషధాన్ని ఏమారుస్తుందనే నివేదికలు ఆందోళన కలిగిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ హెచ్చరించింది.