వివరాల్లోకి వెళ్తే.. అస్సాంలోని రాహాలో భాటిగావ్ ప్రాంతానికి చెందిన సూరజ్, నిహారిక కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. సూరజ్ ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాడు. దీంతో అతడి త్రండి తులేశ్వర్ దాస్ (75) బాధ్యతలను నిహారిక చూసుకుంటోంది. ఈ క్రమంలో తులేశ్వర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
బాధితులు ఇద్దరికీ ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్ సంగీత ధార్, ఆరోగ్య కార్యకర్త పింటు హీరా ప్రాథమిక చికిత్స అందించారు. తులేశ్వర్ దాస్‌ను పరీక్షించి, అతడిని చికిత్స కోసం జిల్లా కోవిడ్ కేర్ సెంటర్‌కు పంపించాలని చెప్పారు. నిహరికను ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకోవాలని సూచించారు.